Home

అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీ పొంగిపొర్లి తీవ్ర దుర్గంధం తో ప్రజలకి ఇక్కట్లు

ఉద్యమపోరు, శేరి లింగంపల్లి, అక్టోబర్ 14 : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పెట్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో పొంగి పోర్లుతున్న డ్రైనేజీ మురికినీరు తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ఇబ్బందుల కి గురవుతున్న కాలని ప్రజలు పలు మార్లు పిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. నిత్యం ఈ దారిగుండనే హైటెక్ సిటీకి ఎన్నో వాహనాలు వస్తూ వెళుతుంటాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పాదచారులకి వాహనదారులకి తీవ్ర అసౌకర్యం గురి అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని అంబేద్కర్...

తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి వరంగల్ కె. మనోహర్నర్సంపేటలో 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు ఉద్యమ పోరు, నర్సంపేట, అక్టోబర్ 5 : తూనికలు, కొలతల విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి కె. మనోహర్ హెచ్చరించారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం, పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోకుండా, శాఖ ముద్రలు వేయించుకోకుండా వినియోగిస్తున్న 15...

​బస్సుల వేళల సమాచారానికి విచారణ కేంద్రం నంబర్ ఏర్పాటు

- డిపో మేనేజర్ ఎం. సరస్వతి వెల్లడి ఉద్యమ పోరు, ​నర్సంపేట, సెప్టెంబర్ 26 : నర్సంపేట ఆర్టీసీ డిపో బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల బయలుదేరు సమయాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ ఎం. సరస్వతి తెలిపారు. ​ఈ మేరకు నర్సంపేట బస్టాండ్‌లోని ఎంక్వైరీ (విచారణ) కేంద్రంలో 7382926166 నంబర్ అందుబాటులో ఉంటుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా,...

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శండాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ...

​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు

నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ​నర్సంపేట, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... "భూమి కోసం, భుక్తి కోసం,...

​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు

నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ​నర్సంపేట, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... "భూమి కోసం, భుక్తి కోసం,...

​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు

నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ​నర్సంపేట, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... "భూమి కోసం, భుక్తి కోసం,...

గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఉద్యమపోరు, గూడూరు, సెప్టెంబర్ 25 శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్* ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం, గూడూరు మండలం మట్టేవాడ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు, ఈ సందర్భంగా కలెక్టర్ చిన్న ముప్పారంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సవరణ, హియరింగ్స్, రీ సర్వే గురించి తహసిల్దార్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదు కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో షెడ్యూల్ ప్రకారం...

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలు ఆదర్శనీయం

బిజెపి పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 25 : పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా eనర్సంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలను, దేశం పట్ల ఆయన అంకితభావాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు సందీప్ మాట్లాడుతూ.. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన *‘అంత్యోదయ’*, సమాజంలోని చివరి వ్యక్తి వరకు...

రామకృష్ణాపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర

వర్షంలో తడుస్తూ పాల్గొన్న మంత్రి వివేక్ ఉద్యమ పోరు /మంచిర్యాల జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో 9 రోజుల వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి.పట్టణంలోని 78 గణనాథులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై రాజీవ్ చౌక్ వరకు శోభాయాత్రగా తీసుకువచ్చారు.అక్కడ ప్రత్యేక పూజలు,కొబ్బరికాయలు కొట్టి గోదావరి నదికి సాగనంపారు.డప్పులు,కోలాటాలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణం మార్మోగింది.వర్షంలో తడుస్తూ మంత్రి హాజరు!కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి...

మంచిర్యాలలో భక్తి పారవశ్యంలో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్

మహా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సతీష్ భవాని దంపతుల ఆధ్యాత్మిక ప్రవచనంవినాయక మండపం వద్ద గో పూజ నిర్వహించిన అంజని పుత్ర రియల్ ఎస్టేట్ ఉద్యమ పోరు /మంచిర్యాల జిల్లా ప్రతినిధి (హరిప్రసాద్): రామకృష్ణాపూర్ పట్టణం భక్తి శ్రావ్యాలతో మార్మోగింది.అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ మహా గణాధిపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ పవిత్ర వేదికపై కామాఖ్య దేవాలయం చైర్మన్,లలితా త్రిపుర సుందరి దేవి ఉపాసకులు శ్రీ సతీష్ - భవాని దంపతులు విచ్చేసి గురుపూజ...

లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా తోట కార్తీక్ నియామకం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా/ఉద్యమ పోరు ప్రతినిధి: తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పాత మంచిర్యాలకు చెందిన తోట కార్తీక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,కార్తీక్ చిన్నతనం నుంచే దేశభక్తి,దైవభక్తి,మానవతా విలువలు మరియు సామాజిక సేవలను పెంపొందించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.ఇప్పుడు లీగల్ స్టూడెంట్స్ జిల్లా కార్యదర్శిగా ఈ నూతన బాధ్యత రావడంతో ఆయనపై సమాజం పట్ల, విద్యార్థుల పట్ల మరింత...

స్వామి వివేకానంద కాలనీలో ఘనంగా 51 రకాల నైవేద్యాలతో మహాగణపతి పూజ

​ఉద్యమపోరు / నర్సంపేట, సెప్టెంబర్ 21: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక స్వామి వివేకానంద కాలనీలో 8వ రోజు గణపతి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన లంబోదరుడికి కాలనీవాసులు 51 రకాల విశేష పిండివంటలు, సాంప్రదాయ వంటకాలతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించారు. ​ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గణపతికి పంచామృతాభిషేకాలు, విశేష పుష్పార్చనలు, సర్వదేవతా అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గణనాథుడికి సమర్పించిన 51 రకాల నైవేద్యాలతో...

అశోక్ నగర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఉద్యమపోరు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 : మంచిర్యాల పట్టణంలోని అశోక్ నగర్ ఏరియా, రేషన్ కోటా ప్రాంగణంలో మంగళవారం ఉదయం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఇరుకుల్ల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 18వ వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవి - రాజు, స్థానిక పుర ప్రముఖులు మరియు ప్రభుత్వ యంత్రాంగ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ...

రామకృష్ణాపూర్ లో ఆర్ట్ గణపతి మహా అన్నదానం - భక్తులతో కిట కిటలాడిన ప్రాంగణం

ప్రజల కోసం కష్ట పాడుతాం అంటున్న గుడిసెల సంధ్యారాణి, రాజా రమేష్ ఉద్యమ పోరు / మంచిర్యాల జిల్లా ప్రతినిధి(హరిప్రసాద్), సెప్టెంబర్ 20 : పాతికేళ్ల చరిత్ర కలిగిన ఆర్ట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన మహా అన్నసంతర్పణకు పరిసర కాలనీల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గుడిసెల సంధ్యారాణి,డాక్టర్ రాజా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి,భక్తులకు స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా వారు...

తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్

ఉద్యమ పోరు, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి (నాగరాజు), సెప్టెంబర్ 20 : తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు, ప్రస్తుతం జస్టిస్ కుమారయ్య లా కాలేజ్ లో చదువుతున్న ఆయన రాష్ట్ర అధ్యక్షులు కె. బాలునాయక్, మరియు జిల్లా అధ్యక్షులు ముక్త సంతోష్ సూచనలతో నియామక పత్రాన్ని అందుకున్నారు, ఈ మేరకు ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ చట్ట అవగాహన కార్యక్రమాలు మరియు న్యాయ విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని హామీ ఇచ్చారు.

బొక్కల గుట్టలో అద్భుతం

గణేశ నవరాత్రుల్లో పంచభూతాల స్పందనమేఘ రూపంలో దైవ దర్శనం ఉద్యమపోరు, మంచిర్యాల, సెప్టెంబర్ 19 : గణపతి నవరాత్రి ఉత్సవాల సంబరాలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, బొక్కల గుట్ట పర్వత ప్రాంతంలో ఒక అపూర్వమైన, హృదయాలను కదిలించే అద్భుతం చోటుచేసుకుంది. సనాతన హిందూ ధర్మంలో పంచభూతాల ఆరాధన ఒక భాగమని, అవి దైవ శక్తితో అనుసంధానమై ఉంటాయని నిరూపించేలా, బొక్కల గుట్ట ఆకాశంలో మేఘాల రూపంలో హిందూ దేవతామూర్తులు భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు.​అద్భుత సంఘటన చోటు చేసుకుంది.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ మహిళతో...

10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో ఘనంగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు

ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 18: నర్సంపేట పట్టణం 10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో పోచమ్మ తల్లి యువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి ప్రవీణ్, ప్రణీత, వలస...

నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛ

రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఉద్యమ పోరు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలన,రజాకార్ల దౌర్జన్యాలు,దోపిడీలు మరియు అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం.నిజాం పాలనలో ప్రజలు అనుభవించిన బానిస సంకెళ్లను తెంచి,భారత్ యూనియన్‌లో తెలంగాణ కలవడానికి ఎందరో మహానుభావుల త్యాగాలు,బలిదానాలు కారణమని రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి కమిటీ అధ్యక్షులు వేముల హరిప్రసాద్ పేర్కొన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ ఆర్ట్...

కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా : పువ్వాడ

శ్రీనివాస్ నగర్ బాధితులకు మాజీ మంత్రి పువ్వాడ మద్దతు ఉద్యమ పోరు, ఖమ్మం, సెప్టెంబర్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులకు ఆయన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చివేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని...