Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా తోట కార్తీక్ నియామకం

Author
Posted By UDYAMA PORU
| 23 Sep 2026, 01:22 PM | TELANGANA
లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా తోట కార్తీక్ నియామకం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా/ఉద్యమ పోరు ప్రతినిధి:

తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పాత మంచిర్యాలకు చెందిన తోట కార్తీక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,కార్తీక్ చిన్నతనం నుంచే దేశభక్తి,దైవభక్తి,మానవతా విలువలు మరియు సామాజిక సేవలను పెంపొందించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.ఇప్పుడు లీగల్ స్టూడెంట్స్ జిల్లా కార్యదర్శిగా ఈ నూతన బాధ్యత రావడంతో ఆయనపై సమాజం పట్ల, విద్యార్థుల పట్ల మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.​అనంతరం తోట కార్తీక్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన అసోసియేషన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ బలోపేతంతో పాటు లీగల్ స్టూడెంట్స్ హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.అలాగే సాధారణ ప్రజలకు న్యాయవ్యవస్థ,చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా తోట కార్తీక్ నియామకం - Additional Image
(4.8 / 5 Ratings)