Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ

Author
Posted By UDYAMA PORU
| 26 Sep 2026, 10:32 AM | TELANGANA
గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ

  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

ఉద్యమపోరు, గూడూరు, సెప్టెంబర్ 25

శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్* ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం, గూడూరు మండలం మట్టేవాడ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు,
ఈ సందర్భంగా కలెక్టర్ చిన్న ముప్పారంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సవరణ, హియరింగ్స్, రీ సర్వే గురించి తహసిల్దార్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదు కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, ఓటరూ జాబితాలో పేర్లు మ్యాపింగ్ కోసం ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ నిర్వహించడం జరుగుతుందని అందులో ఎన్నికల కమిషన్ 11 రకాల గుర్తింపు కార్డులను చూపించి మ్యాపింగ్ చేసుకోవాలని తెలిపారు, ఇంకా స్పందించని ఓటరు లను చైతన్యపరిచి మ్యాపింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, జిల్లాలో 70 గ్రామాలు రీ సర్వేకు ఎంపికైన సర్వే కొనసాగుతుందని, ప్రభుత్వ భూములు, ఆబాది, పట్టా భూములను సర్వే జరుగుతుందని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పక్కాగా సర్వేను కొనసాగించాలని సూచించారు. అనంతరం గూడూరు మండలం, మట్టేవాడ గ్రామంలో ఉన్నా గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న విద్యా బోధనలు, డైట్ మెనూ, యూనిఫార్మ్స్, టెస్ట్ బుక్కు, తదితర వివరాలను పిల్లలను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించి పిల్లలకు యూనిఫామ్ లు అందజేశారు, పిల్లలతో మాట్లాడుతూ వారి యొక్క విద్య సామర్థ్యాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పక్కాగా డైట్ మెనూ పాటించాలని, క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు పిల్లలకు, భోజనం సిద్ధం చేసే సిబ్బందికి నిర్వహించాలని, సిబ్బంది, ఉపాధ్యాయులు, పిల్లల హాజరు వివరాలను వంద శాతం నమోదు అయ్యేవిధంగా చూడాలని, టెస్ట్ బుక్కులు, యూనిఫార్ములు అందించాలని, ఇంగ్లీష్ భాష తోపాటు ఇతర సబ్జెక్టులపై క్లుప్తంగా అర్థమయ్యే విధంగా పిల్లలకు డిజిటల్ తరగతులను నిర్వహించాలని, పిల్లలకు అందించే ఆహారం, వసతి, సౌకర్యాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, ఇనుగుర్తి, గూడూరు తహసిల్దార్లు శ్రీనివాస్, నాగ భవాని, సంబంధిత అధికారులు ఉన్నారు.

గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ - Additional Imageగిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ - Additional Image
(4.8 / 5 Ratings)