Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో ఘనంగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు

Author
Posted By UDYAMA PORU
| 18 Sep 2026, 03:48 PM | TELANGANA
10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో ఘనంగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు

ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 18:

నర్సంపేట పట్టణం 10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో
పోచమ్మ తల్లి యువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

3 లేటెస్ట్ పోస్ట్స్ - ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో నాగిశెట్టి ప్రవీణ్, ప్రణీత, వలస సత్యనారాయణ, శారద, తాళ్లపల్లి కళ్యాణి, హన్మకొండ మరియా, అరపేల్లి వైడూర్యం, అంజలి బొల్ల సుమ పున్నం శిరీష, సుజాత, కొలువుల లలిత, వసంత, మౌనిక, మామిడాల సరోజన , విజయ, పామునూరి సరూప, గద్దె కోటేశ్వరమ్మ, రాయిడి శిరీష, జ్యోతి, శ్రీరామోజు రమ్య కందికొండ సునిత రావుల లక్ష్మి అల్లీ నీరజ అవుల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ తల్లి యువ యూత్ సభ్యులతో పాటు వార్డులోని మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు. కార్యక్రమం సందర్భంగా పోచమ్మ ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

విఘ్నేశ్వరుని కృపతో 10వ వార్డులోని ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

(4.8 / 5 Ratings)