10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో ఘనంగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు
ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 18: నర్సంపేట పట్టణం 10వ వార్డులోని పోచమ్మ ఆలయంలో పోచమ్మ తల్లి యువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి ప్రవీణ్, ప్రణీత, వలస సత్యనారాయణ, శారద, తాళ్లపల్లి కళ్యాణి, హన్మకొండ మరియా, అరపేల్లి వైడూర్యం, అంజలి బొల్ల సుమ పున్నం శిరీష, సుజాత, కొలువుల...