Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

స్వామి వివేకానంద కాలనీలో ఘనంగా 51 రకాల నైవేద్యాలతో మహాగణపతి పూజ

Author
Posted By UDYAMA PORU
| 22 Sep 2026, 10:08 PM | TELANGANA
స్వామి వివేకానంద కాలనీలో ఘనంగా 51 రకాల నైవేద్యాలతో మహాగణపతి పూజ

​ఉద్యమపోరు / నర్సంపేట, సెప్టెంబర్ 21:

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక స్వామి వివేకానంద కాలనీలో 8వ రోజు గణపతి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన లంబోదరుడికి కాలనీవాసులు 51 రకాల విశేష పిండివంటలు, సాంప్రదాయ వంటకాలతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించారు. ​ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గణపతికి పంచామృతాభిషేకాలు, విశేష పుష్పార్చనలు, సర్వదేవతా అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గణనాథుడికి సమర్పించిన 51 రకాల నైవేద్యాలతో మహా హారతి ఇచ్చారు. భక్తుల భజనలు, ‘గణపతి బప్పా మోరియా’ జయజయధ్వానాలతో కాలనీ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో కాలనీ పెద్దలు, మహిళలు, యువత మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 10వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మా ప్రసాద్, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు మేడవరపు కమలాకర్ రావు, ధర గణేష్, శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ కన్వీనర్ ముస్కు రాజేందర్, కో కన్వీనర్లు పస్తం కృష్ణ, అలువాల బిక్షపతి, నిమ్మనబోయిన బిక్షపతి, మంగరాజు, బండారి సుమంత్, పరాచకపు సదానందం, గోరింటాల మహేందర్, కొండ్రాతి కుమార స్వామి, అరి గెల రాజ్ కుమార్ మరియు మోతే ఇంద్రసేనారెడ్డి, బొల్లేని సుమన్, వనపర్తి కుమారస్వామి, కూచన చత్రపతి, పొనుగోటి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

(4.8 / 5 Ratings)