స్వామి వివేకానంద కాలనీలో ఘనంగా 51 రకాల నైవేద్యాలతో మహాగణపతి పూజ

​ఉద్యమపోరు / నర్సంపేట, సెప్టెంబర్ 21: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక స్వామి వివేకానంద కాలనీలో 8వ రోజు గణపతి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన లంబోదరుడికి కాలనీవాసులు 51 రకాల విశేష పిండివంటలు, సాంప్రదాయ వంటకాలతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించారు. ​ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గణపతికి పంచామృతాభిషేకాలు, విశేష పుష్పార్చనలు, సర్వదేవతా అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గణనాథుడికి సమర్పించిన 51 రకాల నైవేద్యాలతో మహా హారతి ఇచ్చారు. భక్తుల భజనలు, ‘గణపతి బప్పా మోరియా’ జయజయధ్వానాలతో కాలనీ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. పూజా...