Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

Author
Posted By UDYAMA PORU
| 04 Oct 2026, 06:25 PM | TELANGANA
తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

  • జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి వరంగల్ కె. మనోహర్
  • నర్సంపేటలో 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు

ఉద్యమ పోరు, నర్సంపేట, అక్టోబర్ 5 :

తూనికలు, కొలతల విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి కె. మనోహర్ హెచ్చరించారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం, పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోకుండా, శాఖ ముద్రలు వేయించుకోకుండా వినియోగిస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వ్యాపారులందరూ తమ తూకపు యంత్రాలు, ఇతర కొలతల పరికరాలను నిర్ణీత గడువులోగా తనిఖీ చేయించి అధికారిక ముద్రలు వేయించుకోవాలని సూచించారు. వినియోగదారులకు సరైన తూకంతో సరుకులు అందించాలని, తూకాల్లో మోసాలకు పాల్పడితే తూనికలు, కొలతల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు సందర్భంగా తూకాలను పరిశీలంచాలని సూచించారు.

తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు - Additional Imageతూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు - Additional Imageతూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు - Additional Image
(4.8 / 5 Ratings)