తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి వరంగల్ కె. మనోహర్నర్సంపేటలో 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు ఉద్యమ పోరు, నర్సంపేట, అక్టోబర్ 5 : తూనికలు, కొలతల విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి కె. మనోహర్ హెచ్చరించారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం, పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోకుండా, శాఖ ముద్రలు వేయించుకోకుండా వినియోగిస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యాపారులందరూ తమ తూకపు యంత్రాలు, ఇతర కొలతల పరికరాలను నిర్ణీత గడువులోగా...