గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) ఆకస్మికంగా తనిఖీ
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఉద్యమపోరు, గూడూరు, సెప్టెంబర్ 25 శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్* ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం, గూడూరు మండలం మట్టేవాడ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు, ఈ సందర్భంగా కలెక్టర్ చిన్న ముప్పారంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సవరణ, హియరింగ్స్, రీ సర్వే గురించి తహసిల్దార్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదు కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, ఓటరూ జాబితాలో పేర్లు మ్యాపింగ్ కోసం ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ నిర్వహించడం జరుగుతుందని అందులో ఎన్నికల...