లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా తోట కార్తీక్ నియామకం
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా/ఉద్యమ పోరు ప్రతినిధి: తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పాత మంచిర్యాలకు చెందిన తోట కార్తీక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,కార్తీక్ చిన్నతనం నుంచే దేశభక్తి,దైవభక్తి,మానవతా విలువలు మరియు సామాజిక సేవలను పెంపొందించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.ఇప్పుడు లీగల్ స్టూడెంట్స్ జిల్లా కార్యదర్శిగా ఈ నూతన బాధ్యత రావడంతో ఆయనపై సమాజం పట్ల, విద్యార్థుల పట్ల మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.అనంతరం తోట కార్తీక్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన అసోసియేషన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు....