Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛ

Author
Posted By UDYAMA PORU
| 18 Sep 2026, 09:07 AM | TELANGANA
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛ

  • రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

ఉద్యమ పోరు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలన,రజాకార్ల దౌర్జన్యాలు,దోపిడీలు మరియు అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం.నిజాం పాలనలో ప్రజలు అనుభవించిన బానిస సంకెళ్లను తెంచి,భారత్ యూనియన్‌లో తెలంగాణ కలవడానికి ఎందరో మహానుభావుల త్యాగాలు,బలిదానాలు కారణమని రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి కమిటీ అధ్యక్షులు వేముల హరిప్రసాద్ పేర్కొన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి ప్రాంగణంలో కమిటీ సభ్యులందరితో కలిసి హరిప్రసాద్ మువ్వన్నెల జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మండలి సభ్యులు,స్థానిక ప్రజలు అత్యంత ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు వేముల హరిప్రసాద్ మాట్లాడుతూ...1948 సెప్టెంబర్ 17న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమయోచిత జోక్యం,వేలాది మంది అమరుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ గడ్డకు స్వేచ్ఛ మరియు విమోచన భాగ్యం సిద్ధించింది.నిజాం రాజరికం యొక్క అణచివేతను ఎండగడుతూ,నాటి వీరుల పోరాట పటిమను నేటి తరానికి చాటిచెప్పడానికే ఈ సంబరాలు నిర్వహిస్తున్నాం అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి కమిటీ సభ్యులు,కార్యకర్తలు మరియు స్థానిక యువత పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించి,తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛ - Additional Image
(4.8 / 5 Ratings)