నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛ
రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఉద్యమ పోరు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలన,రజాకార్ల దౌర్జన్యాలు,దోపిడీలు మరియు అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం.నిజాం పాలనలో ప్రజలు అనుభవించిన బానిస సంకెళ్లను తెంచి,భారత్ యూనియన్లో తెలంగాణ కలవడానికి ఎందరో మహానుభావుల త్యాగాలు,బలిదానాలు కారణమని రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి కమిటీ అధ్యక్షులు వేముల హరిప్రసాద్ పేర్కొన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ ఆర్ట్ గణేష్ మండలి ప్రాంగణంలో కమిటీ సభ్యులందరితో కలిసి హరిప్రసాద్ మువ్వన్నెల జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో...