Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

మంచిర్యాలలో భక్తి పారవశ్యంలో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్

Author
Posted By UDYAMA PORU
| 25 Sep 2026, 03:44 PM | TELANGANA
మంచిర్యాలలో భక్తి పారవశ్యంలో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్

  • మహా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సతీష్ భవాని దంపతుల ఆధ్యాత్మిక ప్రవచనం
  • వినాయక మండపం వద్ద గో పూజ నిర్వహించిన అంజని పుత్ర రియల్ ఎస్టేట్

ఉద్యమ పోరు /మంచిర్యాల జిల్లా ప్రతినిధి (హరిప్రసాద్):

రామకృష్ణాపూర్ పట్టణం భక్తి శ్రావ్యాలతో మార్మోగింది.అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ మహా గణాధిపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ పవిత్ర వేదికపై కామాఖ్య దేవాలయం చైర్మన్,లలితా త్రిపుర సుందరి దేవి ఉపాసకులు శ్రీ సతీష్ - భవాని దంపతులు విచ్చేసి గురుపూజ నిర్వహించారు.వారి రాకతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది.ఈ సందర్భంగా సతీష్ భవాని దంపతులు మాట్లాడుతూ హృదయాలను కదిలించే ప్రసంగం చేశారు.ఒక వ్యక్తిగా మొదలై నేడు ఒక మహోన్నత శక్తిగా ఎదిగిన అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ,గత కొన్ని సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో పదిమందికి ఉపయోగపడే విధంగా కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇది వ్యాపారం కాదు,ఒక యజ్ఞం అని కొనియాడారు.అనంతరం వారు ఒక అద్భుతమైన పురాణ ఘట్టాన్ని గుర్తు చేశారు.ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడట కృష్ణా ఈ ప్రపంచంలో నీకు అత్యంత ఇష్టమైనది ఏమిటి? అని. అందుకు కృష్ణ పరమాత్ముడు నాకు నైవేద్యాలు పెట్టడం కన్నా ఆకలితో ఉన్న పేదవానికి అన్నం పెట్టడమే మిన్న. పదిమందికి సహాయ పడేవాడు,పదిమందికి ఉపయోగపడే పని చేసేవాడే నాకు అత్యంత ప్రీతి పాత్రుడు అని చెప్పాడటని అన్నారు.అలాంటి కృష్ణ తత్వాన్నే నేడు అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ఆచరిస్తోందని,శ్రీ మహాగణపతి ఆశీస్సులు ఈ సంస్థపై,ఈ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు.అనంతరం అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ యాజమాన్యం శ్రీ గుర్రాల శ్రీధర్ ఆధ్యాత్మిక దంపతులైన సతీష్ భవానికి ఘనంగా సత్కరించి పాదపూజ చేశారు.అనంతరం సతీష్ స్వామీజీ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మంచిర్యాలలో భక్తి పారవశ్యంలో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ - Additional Imageమంచిర్యాలలో భక్తి పారవశ్యంలో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ - Additional Image
(4.8 / 5 Ratings)