Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు

Author
Posted By UDYAMA PORU
| 26 Sep 2026, 12:53 PM | TELANGANA
​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు

  • నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

​నర్సంపేట, సెప్టెంబర్ 26:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
​ఈ సందర్భంగా పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... "భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ" అని కొనియాడారు. ఆమె పోరాట పటిమ యావత్ మహిళా లోకానికి ఆదర్శమని, మహిళలందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
​భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు:
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మునిగాల వెంకట్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, తక్కలపెల్లి రవీందర్ రావు, మచ్చిక నరసయ్య పాల్గొన్నారు.
​వీరితో పాటు జిల్లా నాయకురాలు దార్ల రమాదేవి, జిల్లా నాయకులు గోనె యువరాజు, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి, రాయుడి దుష్యంత్ రెడ్డి, దొమ్మటి సంతోష్, నాగిశెట్టి ప్రసాద్, శీలం రాంబాబు, వాసం కరుణ సాంబయ్య, పెండెం వెంకటేశ్వర్లు, తాళ్లపెళ్లి రాంప్రసాద్, కడారి కుమార్, పులిగిల్ల యాదగిరి, కొల్లూరి లక్ష్మీనారాయణ, రాయరాకుల సారంగం, ఐలోని శ్రీను, సుధాకర్ లాల్, కందికొండ శ్రీనివాస్, గాలి శ్రీనివాస్, నాయిని వేణు, మోడం విద్యాసాగర్, పల్నాటి సాంబయ్య, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్, కొప్పు భాస్కర్, వరంగంటి వెంకన్న, గుండెబోయిన శివకోటి, దోనాల రవి, అడప రాంబాబు, నీరటి రంజిత్, కొమ్మ వీరస్వామి, చాపర్తి బిక్షపతి, మహిళా నాయకురాళ్లు చింతం విజయరాణి, ఎస్.కె. కాజాబి, అలాగే మండల సత్యం, వేల్పుల శ్రీను, వేల్పుల సురేష్, రాపోలు శ్రీను, తాబేటి రాజేందర్, ఎన్. రెడ్డి వీరారెడ్డి, దినేష్, మండల సంతోష్ తదితర పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు - Additional Image​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు - Additional Image
(4.8 / 5 Ratings)