Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

గంగాపురిలో కోతుల బీభత్సం..

Author
Posted By UDYAMA PORU
| 16 Sep 2026, 06:05 PM | TELANGANA
గంగాపురిలో కోతుల బీభత్సం..

  • దాడులు జరుగుతున్నా అధికారుల చర్యలేవి?
  • మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్

మంథని, సెప్టెంబర్16(నిత్యం నిఘా ప్రతినిధి):

మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడటంతో పాటు రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గంగాపురికి చెందిన అంగన్‌వాడీ టీచర్ గుండేటి పద్మ చిన్నారులకు పాఠాలు చెబుతున్న సమయంలో కోతుల దాడిలో గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంగాపురిలో ఇప్పటికే వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నారులపై కోతులు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. కోతుల దాడుల భయంతో పిల్లలను బయటకు పంపాలన్నా, వృద్ధులు ఒంటరిగా వెళ్లాలన్నా ఆందోళన చెందాల్సి వస్తోందని వాపోతున్నారు.

• పలుమార్లు ఫిర్యాదులు.. అయినా పరిష్కారం ఏది?

3 లేటెస్ట్ పోస్ట్స్ - ఇవి కూడా చదవండి

కోతుల బెడదపై పలుమార్లు పత్రికల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సంబంధిత ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు అంటున్నారు. సమస్య తీవ్రత అధికారులకు తెలిసినప్పటికీ కోతుల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

• మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూడాలా?

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే చిన్నారులు, సిబ్బందితో పాటు వృద్ధులు, మహిళలు, యువకులు నిత్యం కోతుల భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొందని గంగాపురి వాసులు చెబుతున్నారు. ఇప్పటికే దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ గంగాపురి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోతుల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు రక్షణ కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

(4.8 / 5 Ratings)