గంగాపురిలో కోతుల బీభత్సం..

దాడులు జరుగుతున్నా అధికారుల చర్యలేవి?మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్ మంథని, సెప్టెంబర్16(నిత్యం నిఘా ప్రతినిధి): మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడటంతో పాటు రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గంగాపురికి చెందిన అంగన్‌వాడీ టీచర్ గుండేటి పద్మ చిన్నారులకు పాఠాలు చెబుతున్న సమయంలో కోతుల దాడిలో గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంగాపురిలో ఇప్పటికే వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నారులపై కోతులు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. కోతుల దాడుల భయంతో పిల్లలను బయటకు పంపాలన్నా, వృద్ధులు ఒంటరిగా వెళ్లాలన్నా ఆందోళన చెందాల్సి...