Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో సాగర్ జలాల విడుదల

Author
Posted By UDYAMA PORU
| 15 Sep 2026, 02:22 PM |
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో సాగర్ జలాల విడుదల

ముఖ్యమైన పాయింట్స్:

  • పంటలకు ప్రాణం పోసిన సాగునీరు..
  • హర్షం వ్యక్తం చేసిన బోనకల్ రైతాంగం

ఉద్యమపోరు, బోనకల్, సెప్టెంబర్ 15:
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో నాగార్జునసాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయడంతో బోనకల్ మండల రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. బీబీసీ కాలువ ద్వారా సాగర్ జలాలు బోనకల్ మండలానికి చేరుకోవడంతో వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న పంటలకు ఊరట లభించింది.

సాగర్ జలాలు రావడంతో సాగునీటితో పాటు చెరువులు, కుంటల్లోకి నీరు చేరే అవకాశం ఏర్పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సాగునీరు అందడంతో వాటిని కాపాడుకునే అవకాశం ఏర్పడిందని రైతులు తెలిపారు. పంటలు ఎండిపోతున్న సమయంలో సాగర్ నీరు విడుదల చేయడం పంటలకు ప్రాణం పోసినట్టుగా ఉందని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే గుర్తించి ప్రజా ప్రభుత్వం సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగర్ జలాలను విడుదల చేయడం అభినందనీయమని రైతులు అన్నారు. అందుబాటులోకి వచ్చిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడుకోవాలని వారు కోరారు.

3 లేటెస్ట్ పోస్ట్స్ - ఇవి కూడా చదవండి

సాగర్ జలాలను విడుదల చేయించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బోనకల్ మండల రైతాంగం ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో బోనకల్ మండల అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, పైడిపల్లి కిషోర్, పిల్లలమరి నాగేశ్వరరావు, బద్రు నాయక్, యార్రంశెట్టి సుబ్బారావు, కందుల పాపారావు, గూడా నరసయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

(4.8 / 5 Ratings)