డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో సాగర్ జలాల విడుదల
ముఖ్యమైన పాయింట్స్: పంటలకు ప్రాణం పోసిన సాగునీరు..హర్షం వ్యక్తం చేసిన బోనకల్ రైతాంగం ఉద్యమపోరు, బోనకల్, సెప్టెంబర్ 15: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో నాగార్జునసాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయడంతో బోనకల్ మండల రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. బీబీసీ కాలువ ద్వారా సాగర్ జలాలు బోనకల్ మండలానికి చేరుకోవడంతో వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న పంటలకు ఊరట లభించింది. సాగర్ జలాలు రావడంతో సాగునీటితో పాటు చెరువులు, కుంటల్లోకి నీరు చేరే అవకాశం ఏర్పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సాగునీరు అందడంతో వాటిని కాపాడుకునే అవకాశం ఏర్పడిందని రైతులు తెలిపారు. పంటలు ఎండిపోతున్న సమయంలో సాగర్ నీరు విడుదల చేయడం...