Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి

Author
Posted By UDYAMA PORU
| 16 Sep 2026, 05:06 PM | Array
22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా..
  • కలెక్టర్‌కు వినతిపత్రం

ఉద్యమపోరు, మేడ్చెల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 16:

తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించి, అర్హత కలిగిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బుధవారం మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో వాటి యజమానులు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు తదితర వ్యవహారాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను సంబంధిత అధికారులు పరిశీలించి, అర్హత ఉన్న భూములపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న భూ సమస్యలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఒకేసారి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. భూ రికార్డులను పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన అనంతరం అర్హత కలిగిన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నరసింహ, అరవింద్ కుమార్ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంటరీ అధ్యక్షుడు కందికంటి అశోక్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సుంకర వెంకటేష్, మల్కాజిగిరి పార్లమెంట్ అడహాక్ కమిటీ సభ్యులు కరణం గోపి, చంద్రశేఖర్, రామకృష్ణ, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నరేష్ ముదిరాజు, జవహర్‌నగర్ అధ్యక్షుడు నామాల సురేష్, వెంకటరమణ, దమ్మాయిగూడ అధ్యక్షుడు కృష్ణారావు, నాగారం అధ్యక్షుడు కొండ జంగారెడ్డి, నాయకులు నాగరాజు, తండాలపల్లి శంకర్, కాప్రా సీనియర్ నాయకుడు రాములు యాదవ్, తెలుగు మహిళా నాయకురాలు ఆశాబ్దింతు, ఉమాశంకర్ గౌడ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

(4.8 / 5 Ratings)