22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి
ముఖ్యమైన పాయింట్స్:మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా..కలెక్టర్కు వినతిపత్రం ఉద్యమపోరు, మేడ్చెల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 16: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించి, అర్హత కలిగిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బుధవారం మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో వాటి యజమానులు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు తదితర వ్యవహారాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను సంబంధిత అధికారులు...