Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

జాతీయ లోక్ అదాలత్‌లో 8,288 కేసుల పరిష్కారం

Author
Posted By UDYAMA PORU
| 13 Sep 2026, 05:13 PM | TELANGANA, వరంగల్
జాతీయ లోక్ అదాలత్‌లో 8,288 కేసుల పరిష్కారం

ఉద్యమ పోరు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. రాజీకి అవకాశం ఉన్న వివిధ కేసుల్లో మొత్తం 8,288 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్ కేసులు 1,595, ఈ-పెట్టి కేసులు 2,171, మోటార్ వాహన చట్టం కేసులు 4,522, సైబర్ క్రైమ్ కేసులు 134 ఉన్నాయి. సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలుపుదల చేసిన రూ.93,30,616 మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయాలని కోర్టులు ఉత్తర్వులు జారీ చేశాయి. రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. అలాగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

(4.8 / 5 Ratings)