అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీ పొంగిపొర్లి తీవ్ర దుర్గంధం తో ప్రజలకి ఇక్కట్లు
ఉద్యమపోరు, శేరి లింగంపల్లి, అక్టోబర్ 14 : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పెట్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో పొంగి పోర్లుతున్న డ్రైనేజీ మురికినీరు తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ఇబ్బందుల కి గురవుతున్న కాలని ప్రజలు పలు మార్లు పిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. నిత్యం ఈ దారిగుండనే హైటెక్ సిటీకి ఎన్నో వాహనాలు వస్తూ వెళుతుంటాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పాదచారులకి వాహనదారులకి తీవ్ర అసౌకర్యం గురి అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని అంబేద్కర్ నగర్ బస్తీ వాసులు కోరుతున్నారు