బస్సుల వేళల సమాచారానికి విచారణ కేంద్రం నంబర్ ఏర్పాటు
- డిపో మేనేజర్ ఎం. సరస్వతి వెల్లడి ఉద్యమ పోరు, నర్సంపేట, సెప్టెంబర్ 26 : నర్సంపేట ఆర్టీసీ డిపో బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల బయలుదేరు సమయాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ ఎం. సరస్వతి తెలిపారు. ఈ మేరకు నర్సంపేట బస్టాండ్‌లోని ఎంక్వైరీ (విచారణ) కేంద్రంలో 7382926166 నంబర్ అందుబాటులో ఉంటుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సమయానికి అనుగుణంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు