​మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం: బీఆర్ఎస్ నేతలు

నర్సంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ​నర్సంపేట, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... "భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక చాకలి...