పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలు ఆదర్శనీయం
బిజెపి పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 25 : పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా eనర్సంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలను, దేశం పట్ల ఆయన అంకితభావాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు సందీప్ మాట్లాడుతూ.. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన *‘అంత్యోదయ’*, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే ఆలోచన నేటికీ ఎంతో ప్రాసంగికమన్నారు. దేశం, సమాజం కోసం ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం...