రామకృష్ణాపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర
వర్షంలో తడుస్తూ పాల్గొన్న మంత్రి వివేక్ ఉద్యమ పోరు /మంచిర్యాల జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో 9 రోజుల వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి.పట్టణంలోని 78 గణనాథులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై రాజీవ్ చౌక్ వరకు శోభాయాత్రగా తీసుకువచ్చారు.అక్కడ ప్రత్యేక పూజలు,కొబ్బరికాయలు కొట్టి గోదావరి నదికి సాగనంపారు.డప్పులు,కోలాటాలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణం మార్మోగింది.వర్షంలో తడుస్తూ మంత్రి హాజరు!కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వర్షంలో తడుస్తూనే గణనాథుడికి పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి నిమజ్జనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్వరలోనే 76...