అశోక్ నగర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఉద్యమపోరు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 : మంచిర్యాల పట్టణంలోని అశోక్ నగర్ ఏరియా, రేషన్ కోటా ప్రాంగణంలో మంగళవారం ఉదయం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఇరుకుల్ల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 18వ వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవి - రాజు, స్థానిక పుర ప్రముఖులు మరియు ప్రభుత్వ యంత్రాంగ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. గత పది సంవత్సరాలుగా నూతన రేషన్...