తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్

ఉద్యమ పోరు, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి (నాగరాజు), సెప్టెంబర్ 20 : తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు, ప్రస్తుతం జస్టిస్ కుమారయ్య లా కాలేజ్ లో చదువుతున్న ఆయన రాష్ట్ర అధ్యక్షులు కె. బాలునాయక్, మరియు జిల్లా అధ్యక్షులు ముక్త సంతోష్ సూచనలతో నియామక పత్రాన్ని అందుకున్నారు, ఈ మేరకు ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ చట్ట అవగాహన కార్యక్రమాలు మరియు న్యాయ విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని హామీ ఇచ్చారు.