కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా : పువ్వాడ

శ్రీనివాస్ నగర్ బాధితులకు మాజీ మంత్రి పువ్వాడ మద్దతు ఉద్యమ పోరు, ఖమ్మం, సెప్టెంబర్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులకు ఆయన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చివేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని పువ్వాడ ఆందోళన వ్యక్తం చేశారు. వికాసం, అభివృద్ధి చేపట్టడం చేతకాని ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేసి...