విపత్తుల వేళ తక్షణ స్పందనకు యువ ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ అంకిత్
ఉద్యమపోరు, భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 : విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలోని 6వ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బెటాలియన్‌కు చేరుకున్న కలెక్టర్‌కు సిబ్బంది గౌరవ వందనం సమర్పించగా, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల వైవిధ్యం కారణంగా దేశంలో వివిధ రకాల విపత్తులు సంభవించే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి...