కాశీబుగ్గలో ప్రధాన రోడ్డుపైనే చెత్త కుప్పలు
ముఖ్యమైన పాయింట్స్:అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం ఉద్యమపోరు, వరంగల్, సెప్టెంబర్ 16 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ పరిధిలోని వివేకానంద కాలనీ దుస్సుకుంట చెరువు వద్ద పరిస్థితి దారుణంగా మారింది. కాశీబుగ్గ మెయిన్ రోడ్డు నుంచి ఎస్సార్ నగర్, కోటిలింగాలకు వెళ్లే ప్రధాన దారిలోని సీసీ రోడ్డుపైనే బుధవారం భారీగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి.ప్రధాన రహదారిపైనే చెత్త పేరుకుపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగల బెడద పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిత్యం వినియోగించే ప్రధాన రహదారిపైనే చెత్త కుప్పలు పేరుకుపోతున్నా సంబంధిత అధికారులు...