సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి – బీజేపీ డిమాండ్
ఉద్యమ పోరు, నర్సంపేట, సెప్టెంబర్ 15 : 1948 సెప్టెంబర్ 17 న నిజాం నవాబు మరియు రజాకార్ల క్రూరమైన, నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన మహత్తర దినమని, ఈ చారిత్రక దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ (BJP) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నర్సంపేట డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) ఉమారాణి గారికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి *డా. గొగుల రాణా ప్రతాప్ రెడ్డి* ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొమురం భీమ్, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి వంటి...