సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే -- రాణి రుద్రమ

ముఖ్యమైన పాయింట్స్:చరిత్రను వక్రీకరించి జాతీయవాదుల త్యాగాలను మరుగునపెట్టే కుట్రలను బీజేపీ సహించదు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఉద్యమ పోరు, నర్సంపేట, సెప్టెంబర్ 15 : ఈరోజు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ.. "సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరుపురాని, మరుగునపరచలేని చారిత్రక ఘట్టం. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన రోజును ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ గా గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. సెప్టెంబర్ 17ను ‘విలీన దినం’, ‘ప్రజా...