స్వామి వివేకానంద కాలనీ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ఉద్యమపోరు, [నర్సంపేట], సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సంపేట లోని స్వామి వివేకానంద కాలనీలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, కాలనీ ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ప్రజల్లో ఐక్యత, భక్తి, సోదరభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని...