త్వరలోనే కొండా మురళికి కీలక పదవి వచ్చే ఛాన్స్
ఉద్యమ పోరు, వరంగల్ : గత కొద్దిరోజులుగా తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ఊహాగానాలకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ గట్టి సమాధానమిచ్చారు. ఆ ప్రచారమంతా పచ్చి అబద్ధమని, పార్టీ మారే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లో భర్త కొండా మురళితో కలిసి ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం "మా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌లోనే మొదలైంది.. చివరి శ్వాస వరకూ ఇక్కడే ఉంటాం" అని సురేఖ స్పష్టం చేశారు. గతంలో అనివార్య కారణాల వల్లే బీఆర్ఎస్లోకి వెళ్లాల్సి వచ్చిందని, ఎవరూ తమను గెంటేయలేదని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లోనూ హస్తం...