బ్రిక్స్ వేదికగా ఐరాస చీఫ్ శాంతి మంత్రం
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర ఘర్షణలతో సతమతమవుతున్న వేళ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ప్రపంచ శాంతికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గాజా నుంచి మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్, సూడాన్ వరకు ప్రపంచానికి శాంతి అత్యవసరమని నొక్కి చెప్పారు. సమ్మిళిత ప్రపంచ వృద్ధికి శాంతి పునాది అని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో ప్రత్యర్థి దేశాలైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వంటి మధ్యప్రాచ్య...