రామకృష్ణాపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర
వర్షంలో తడుస్తూ పాల్గొన్న మంత్రి వివేక్
ఉద్యమ పోరు /మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో 9 రోజుల వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి.పట్టణంలోని 78 గణనాథులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై రాజీవ్ చౌక్ వరకు శోభాయాత్రగా తీసుకువచ్చారు.అక్కడ ప్రత్యేక పూజలు,కొబ్బరికాయలు కొట్టి గోదావరి నదికి సాగనంపారు.డప్పులు,కోలాటాలు,
గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణం మార్మోగింది.వర్షంలో తడుస్తూ మంత్రి హాజరు!కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వర్షంలో తడుస్తూనే గణనాథుడికి పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి నిమజ్జనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్వరలోనే 76 జీవో ద్వారా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తాం.ఇప్పటికే సీ.ఎంతో మాట్లాడాము అంటూ అలాగే ఆర్కే ఓసి మెగా ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందన్నారు.దీనితో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు.వినాయకుడు అందరినీ చల్లగా దీవించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసిపి వి.కిరణ్ కుమార్, మందమర్రి సిఐ పి.రమేష్,ఎస్ఐ జాడి.శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జి. సంధ్యారాణి,కమిషనర్ ఎన్. మురళీకృష్ణ,డిసిసి అధ్యక్షులు పి. రఘునాథ్ రెడ్డి,నాయకులు ఉప్పలయ్య, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.