🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 22 September 2026, 12:38 pm Posted by : UDYAMA PORU

అశోక్ నగర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

News Image
ఉద్యమపోరు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 :
మంచిర్యాల పట్టణంలోని అశోక్ నగర్ ఏరియా, రేషన్ కోటా ప్రాంగణంలో మంగళవారం ఉదయం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఇరుకుల్ల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 18వ వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవి - రాజు, స్థానిక పుర ప్రముఖులు మరియు ప్రభుత్వ యంత్రాంగ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ సందర్భంగా అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. గత పది సంవత్సరాలుగా నూతన రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న అర్హులందరికీ కార్డులు అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ప్రధాన ముఖ్యాంశాలు:

సన్న బియ్యం పంపిణీ:
ఇప్పటివరకు లావు బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు.

ఆందోళన వద్దు:
కార్డులు రాని అర్హులెవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని,తదుపరి విడతలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 Home