🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 10:39 pm Posted by : UDYAMA PORU

రామకృష్ణాపూర్ లో ఆర్ట్ గణపతి మహా అన్నదానం - భక్తులతో కిట కిటలాడిన ప్రాంగణం

News Image
ప్రజల కోసం కష్ట పాడుతాం అంటున్న గుడిసెల సంధ్యారాణి, రాజా రమేష్
ఉద్యమ పోరు / మంచిర్యాల జిల్లా ప్రతినిధి(హరిప్రసాద్), సెప్టెంబర్ 20 :

పాతికేళ్ల చరిత్ర కలిగిన ఆర్ట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన మహా అన్నసంతర్పణకు పరిసర కాలనీల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గుడిసెల సంధ్యారాణి,డాక్టర్ రాజా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి,భక్తులకు స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భక్తి విషయంలో వివక్ష తగదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అశోక్ నగర్,రామ్ నగర్,ఠాగూర్ నగర్.. మూడు కాలనీల భక్తులు 25 ఏళ్లుగా ఐక్యంగా ఈ మండపాన్ని నడిపిస్తున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన మండపానికి శాశ్వత షెడ్డు నిర్మాణంలో అధికారులు వివక్ష చూపడం బాధాకరం. రాజకీయాలకు అతీతంగా,భక్తుల సెంటిమెంట్ ను గౌరవించి వెంటనే అనుమతులు ఇవ్వాలి.ఈ కమిటీకి మేమున్నామనే ధైర్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.ధర్మం,భక్తి విషయంలో ప్రజలందరినీ సమానంగా చూసే ప్రభుత్వమే నిజమైన ప్రజాస్వామ్యమని వారు పేర్కొన్నారు.
🏠 Home