🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 6:40 pm Posted by : UDYAMA PORU

గ్రామకంఠం భూమి "కబ్జా"

News Image
పులిగిల్లలో కబ్జాల పర్వంమేము చదును చేసాం ఆ భూమి మాదేకబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవుగ్రామ సెక్రెటరీ జోగు సైదులు
వలిగొండ/సెప్టెంబరు 16, ఉద్యమ పోరు :
వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో గ్రామంలోని విలువైన భూములపై గ్రామంలోని ఖాళీగా ఉన్న స్థలాల్లో, గ్రామకంఠం భూములను కబ్జా చేయడం వారి నైజంగా మారిపోయింది. ఓ గ్రామం లోని కొన్ని ఖాళీ స్థలాలు గ్రామకంఠం భూములు ఉండడంతో అట్టి భూములపై రాజకీయ పలుకుబడితో కబ్జాలు చేయడం ఆనవాయితీ గా మారిపోయింది. గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ప్రజలు తమ స్వలాభం కోసం గ్రామంలో ఉన్న భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగితే గ్రామంలోని ప్రభుత్వ భూములు అందిన కాడికి దోచేసుకుంటారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు.

కబ్జా చేస్తే నోటీసులు జారీ చేస్తాం: సెక్రటరీ సైదులు

గ్రామ పంచాయతీ సెక్రెటరీ సైదులను సంప్రదించగా గ్రామంలోని గ్రామ కంఠం భూములను అక్రమంగా కబ్జా చేసిన వారందరికీ గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అట్టి భూమికి సంబంధించిన ధ్రువ పత్రాలు ఉంటే తమ గ్రామ పంచాయతీకి తీసుకొని రావాలని నోటీసులు జారీ చేశామని అన్నారు. వారి నుంచి సమాచారం రాగానే దీనిపై, వెంటనే ఉన్నత అధికారుల సూచన మేరకు గ్రామ కంఠం భూమిని పరిశీలించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
🏠 Home