విపత్తుల వేళ తక్షణ స్పందనకు యువ ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ అంకిత్
ఉద్యమపోరు, భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 : విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలోని 6వ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బెటాలియన్‌కు చేరుకున్న కలెక్టర్‌కు సిబ్బంది గౌరవ వందనం సమర్పించగా, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల వైవిధ్యం కారణంగా దేశంలో వివిధ రకాల విపత్తులు సంభవించే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదలు, ఆకస్మిక వరదలు, పట్టణ ప్రాంతాల్లో నీటిముంపు, అటవీ అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున స్థానికంగా శిక్షణ పొందిన యువత అందుబాటులో ఉండటం ఎంతో అవసరమన్నారు. అధికారిక సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు ఆపదమిత్రలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
విపత్తుల సమయంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక అప్రమత్తత, సమయస్ఫూర్తి, పరిస్థితులను వేగంగా అంచనా వేసే సామర్థ్యం, సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఎంతో కీలకమని అన్నారు. శిక్షణలో ప్రామాణిక నిర్వహణ విధానాలు, సమాచార ప్రసారం, రెస్క్యూ పరికరాల వినియోగం, బృంద సమన్వయం వంటి అంశాలను పూర్తిగా నేర్చుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణ కేవలం తరగతి గదికే పరిమితం కాదని, క్షేత్రస్థాయిలో నిరంతర సాధన, మాక్ డ్రిల్స్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అవసరమైన రెస్క్యూ పరికరాలు, కిట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
6వ బెటాలియన్ కమాండెంట్ పి.సి.వి. రమణ మాట్లాడుతూ విపత్తులు సంభవించిన తొలి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమన్నారు. అధికారిక సహాయక బృందాలు చేరుకునేలోపు స్థానికంగా శిక్షణ పొందిన ఆపదమిత్రలు వేగంగా స్పందించి ప్రాథమిక సహాయక చర్యలు చేపట్టగలరని తెలిపారు. శిక్షణలో బోట్ నిర్వహణ, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు, పైకి ఎక్కడం, కిందికి దిగడం, రాక్ క్లైంబింగ్, వివిధ రకాల ముడుల వినియోగం వంటి ప్రాక్టికల్ అంశాలను నేర్చుకోవాలని సూచించారు.
అనంతరం ఆపదమిత్రలకు కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా శిక్షణ కిట్లను అందజేశారు. విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొనే యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఆపదమిత్రకు మూడేళ్ల కాలానికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 416 మంది ఆపదమిత్రులకు శిక్షణ ఇవ్వనున్నామని, తొలి విడతగా 120 మందికి శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాల మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ అందిస్తున్నారు. నెహ్రూ యువ కేంద్రాలు, ఎన్‌ఎస్‌ఎస్, మై భారత్, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర సంస్థల ద్వారా ఎంపికైన యువతకు శిక్షణ ఇస్తున్నారు. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరిగే శిక్షణలో విపత్తుల రకాలు, ప్రకృతి, మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులు, ముందస్తు చర్యలు, విపత్తుల సమయంలో స్పందన, అనంతర సహాయక చర్యలు, ప్రథమ చికిత్స, రెస్క్యూ పరికరాల వినియోగం, బోట్‌ను అమర్చడం, విడదీయడం, ప్రారంభించడం, నిర్వహణ, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు, రాక్ క్లైంబింగ్, వివిధ రకాల ముడులపై సైద్ధాంతిక, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో సుచిత్ర, పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, శిక్షకులు, ఆపదమిత్రలు తదితరులు పాల్గొన్నారు.