కాశీబుగ్గలో ప్రధాన రోడ్డుపైనే చెత్త కుప్పలు
ముఖ్యమైన పాయింట్స్:అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
ఉద్యమపోరు, వరంగల్, సెప్టెంబర్ 16 :
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ పరిధిలోని వివేకానంద కాలనీ దుస్సుకుంట చెరువు వద్ద పరిస్థితి దారుణంగా మారింది. కాశీబుగ్గ మెయిన్ రోడ్డు నుంచి ఎస్సార్ నగర్, కోటిలింగాలకు వెళ్లే ప్రధాన దారిలోని సీసీ రోడ్డుపైనే బుధవారం భారీగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి.ప్రధాన రహదారిపైనే చెత్త పేరుకుపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగల బెడద పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు నిత్యం వినియోగించే ప్రధాన రహదారిపైనే చెత్త కుప్పలు పేరుకుపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కాశీబుగ్గ నుంచి ఎస్సార్ నగర్, కోటిలింగాలకు వెళ్లే ప్రధాన మార్గమే చెత్త కుప్పలతో దర్శనమివ్వడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు సమస్యను చూసీ చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించడంతో పాటు, ప్రధాన రహదారిపై మళ్లీ చెత్త పేరుకుపోకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.