🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 September 2026, 6:33 pm Posted by : UDYAMA PORU

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి – బీజేపీ డిమాండ్

News Image
ఉద్యమ పోరు, నర్సంపేట, సెప్టెంబర్ 15 :
1948 సెప్టెంబర్ 17 న నిజాం నవాబు మరియు రజాకార్ల క్రూరమైన, నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన మహత్తర దినమని, ఈ చారిత్రక దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ (BJP) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నర్సంపేట డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) ఉమారాణి గారికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి *డా. గొగుల రాణా ప్రతాప్ రెడ్డి* ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొమురం భీమ్, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి వంటి వందలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని కొనియాడారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దృఢ సంకల్పంతో "ఆపరేషన్ పోలో" ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతావనిలో అంతర్భాగమైందని గుర్తుచేశారు.
గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి ఈ చారిత్రక దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం అమరవీరులను అవమానించడమేనని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ 17ను "హైదరాబాద్ విమోచన దినోత్సవం"గా ఘనంగా నిర్వహిస్తోందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, నూతన తరానికి విమోచన పోరాట చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

ప్రధాన డిమాండ్లు:
* ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు పాఠశాలల్లో అధికారికంగా జాతీయ పతాకావిష్కరణ చేయాలి.
* విమోచన పోరాట అమరవీరులకు ఘన నివాళులు అర్పించేలా తగు అధికారిక ఆదేశాలు జారీ చేయాలి.
తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

ఈ కార్యక్రమంలో... మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ 28th వార్డ్ కౌన్సిలర్ జూలూరి రోజా రాణి గారు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి ,నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబెర్ మహేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు అంబేత్కర్ నల్లబెల్లి అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి అచ్చ దయాకర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు,బీజేపీ పట్టణ నాయకులు సూత్రపు సరిత,విజయ్ సింగ్, కాసుల నాగేంద్ర బాబు, పొనుగోటి రవీంద్ర చారి,అల్లం నిఖిల్ ,ముత్యాల శ్రీనివాస్, సామల ప్రవీణ్ కుమార్, నూనె రంజిత్,అజీమ్, అనిల్,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home