🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 September 2026, 5:56 pm Posted by : UDYAMA PORU

చెన్నారావుపేట మండల కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు.

News Image
ఉద్యమపోరు, చెన్నారావుపేట, సెప్టెంబర్ 15 :
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని హై స్కూల్ అంగన్వాడి సెంటర్లో ఘనంగా పోషకాహార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి సూపర్వైజర్ రాధా, జిపిఓ విజయలక్ష్మి లు హాజరై తల్లిపాల ప్రాముఖ్యత మరియు పోషకాహారం ప్రాధాన్యత గురించి తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట అంగన్వాడి ఫస్ట్ సెంటర్ టీచర్ బండారి విజయ, సెకండ్ సెంటర్ టీచర్ దేవమ్మ, కట్టయ్య పల్లె సెంటర్ టీచర్ ఈగ మంజుల, ఆయా బూర కేతమ్మ మరియు అంగన్వాడి పిల్లలు, తల్లులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home