🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 September 2026, 8:06 pm Posted by : UDYAMA PORU

స్వామి వివేకానంద కాలనీ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

News Image
ఉద్యమపోరు, [నర్సంపేట], సెప్టెంబర్ 14:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సంపేట లోని స్వామి వివేకానంద కాలనీలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, కాలనీ ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఉదయం నుంచి భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ప్రజల్లో ఐక్యత, భక్తి, సోదరభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ప్రస్తుత కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ లు పాల్గొనగా కార్యక్రమ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద కాలనీ అధ్యక్షులు మేడవరపు కమలాకర్, జనరల్ సెక్రటరీ దార గణేష్, వినాయక ఉత్సవ కమిటీ కన్వీనర్ ముస్కు రాజేందర్, కో కన్వీనర్లు పస్తం కృష్ణ, అలవాల బిక్షపతి, నిమ్మనబోయిన బిక్షపతి, అరిగల రాజకుమార్, పి. వేణుగోపాల్ రెడ్డి, దేవులపల్లి సతీష్, మంగ రాజు, గోరంట్ల మహేందర్, బండారి సుమంత్, కొండ్రాతి కుమారస్వామి, కాలనీ యువత, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
🏠 Home