🏠 udyamaporu.com
Watermark
Newspaper Logo
Date of Publish : 13 September 2026, 5:41 pm Posted by : UDYAMA PORU

చెన్నరావుపేటలో జనతా ట్రస్ట్ వారి 3వ ఉచిత కంటి వైద్య శిబిరం

News Image
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం - జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

ఉద్యమపోరు, చెన్నరావుపేట :
చెన్నరావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్ ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి మరియు జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 3వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కంది గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ శిబిరానికి చెన్నరావుపేట మండలం నుండి సుమారు *677 మంది* ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ శిబిరంలో మొత్తం 677 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, అవసరమైన 412 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే తీవ్రమైన కంటి సమస్యలు, శుక్లాలు (క్యాటరాక్ట్) వంటి వ్యాధులతో బాధపడుతున్న 65 మందిని ఉచిత కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేసి, జనతా ట్రస్ట్  మరియు శంకర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, వైద్య సలహాలు అందించారు. కంటి ఆపరేషన్లు అవసరమైన 65 మందిని గుర్తించి, జనతా ట్రస్ట్ మరియు శంకర్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

*ఈ సందర్భంగా కంది గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ*...

పేద ప్రజలకు ఉపయోగపడే
ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారిని మరియు వారి మిత్ర బృందాన్ని అభినందించారు, వారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.

*ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ...*

"ఆర్థిక స్థోమత లేక వైద్యం పొందలేని పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవడమే జనతా ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. డబ్బు లేక ఏ ఒక్క పేదవాడు కూడా వైద్యానికి దూరం కాకూడదు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందించే వరకు మా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి." అని అన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యమని, రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యా సహాయ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని, ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.

శిబిరాన్ని విజయవంతం చేసిన శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందానికి, జనతా ట్రస్ట్ సభ్యులకు, పెద్ద ఎత్తున హాజరైన ప్రజలకు డా. రాణా ప్రతాప్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల ఆరోగ్యమే ప్రథమ లక్ష్యంగా, సేవే సంకల్పంగా జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ బృందం మరియు చెన్నరావుపేట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home