త్వరలోనే కొండా మురళికి కీలక పదవి వచ్చే ఛాన్స్
ఉద్యమ పోరు, వరంగల్ :
గత కొద్దిరోజులుగా తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ఊహాగానాలకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ గట్టి సమాధానమిచ్చారు. ఆ ప్రచారమంతా పచ్చి అబద్ధమని, పార్టీ మారే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లో భర్త కొండా మురళితో కలిసి ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం
"మా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌లోనే మొదలైంది.. చివరి శ్వాస వరకూ ఇక్కడే ఉంటాం" అని సురేఖ స్పష్టం చేశారు. గతంలో అనివార్య కారణాల వల్లే బీఆర్ఎస్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని, ఎవరూ తమను గెంటేయలేదని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లోనూ హస్తం గుర్తుపైనే బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు. మంత్రి పదవి ఊడటంపై స్పందిస్తూ.. పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని, కానీ ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వకపోవడమే మనస్తాపం కలిగించిందని పేర్కొన్నారు. మంత్రి పదవి ఓ అలంకారం మాత్రమేనని, తన హయాంలో మూడు శాఖలను అవినీతి రహితంగా నడిపించానని తెలిపారు.
మురళికి పదవి సంకేతాలు – అధిష్ఠానం హామీ
పార్టీ మార్పు వార్తల వేళ అధిష్ఠానం పెద్దలు తనతో మాట్లాడారని, పార్టీలోనే ఉంటామని స్పష్టం చేసినట్లు సురేఖ చెప్పారు. ఈ క్రమంలోనే కొండా మురళికి త్వరలోనే సముచిత పదవి కల్పిస్తామనే హామీ నాయకత్వం నుంచి వచ్చిందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి మళ్లీ గెలిచి తీరుతానని, మంత్రిగా రీ-ఎంట్రీ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24-25 డివిజన్లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు.
విపక్షాలపై తీవ్ర విమర్శలు
కార్పొరేటర్‌గా కూడా నెగ్గలేని కొందరు నేతలు హద్దుల్లో ఉండి మాట్లాడాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఉద్దేశించి హెచ్చరించారు. వైఎస్సార్ మరణం తర్వాత కొందరు స్వార్థ నేతలు తమకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అప్పటి సిట్టింగ్ మంత్రిని ఓడించడానికే కేసీఆర్ తనకు వరంగల్ తూర్పు బాధ్యతలు ఇచ్చారని గుర్తుచేశారు. తాము పరకాల నుంచి బయటకు వచ్చాకే చల్లా ధర్మారెడ్డి అక్రమ సంపాదనకు తెరలేపారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.